Maa Telangana News
Date of Publish : 27/10/2026, 10:21 pm
Published by Muthyala Praveen Reddy

అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు

-జిల్లా విద్యాధికారి వై.తిరుపతిరావు

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి)అక్టోబర్-27

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఎస్.సిఇ.ఆర్.టి. తెలంగాణ మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోల్  ప్లే పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ రోల్ ప్లే పోటీలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతిరావు.ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎంతో సృజన దాగి ఉంటుందని ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థులను గమనిస్తూ వారిలో దాగివున్న అంతర్గత సృజనను వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.విద్యార్థుల్లో బాల్యదశ నుండి వివిధ సామాజిక రుగ్మతల పట్ల స్పృహ కలిగి ఉండాలని కోరారు. అంతేకాకుండా ఆరోగ్యము,మానసిక ఆరోగ్యము, విలువలు,లింగ సమానత, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, శారీరక,మానసిక రక్షణ. సామాజిక మాధ్యమాలయందు జాగ్రత్తగా ఉండడం ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగి ఉండాలని ఎస్.సి.ఇ.ఆర్.టి ఈ విషయాల పట్ల పిల్లల్లో అవగాహన కలిగించడానికి ఇలాంటి రోల్ ప్లేస్ ను ఏర్పాటు చేసిందని, వీటిని విద్యార్థుల్లో విరివిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని,విద్యార్థులు ఇలాంటి సామాజిక రుగ్మతల యందు తగు జాగ్రత్తగా మసులుకోవాలని అలాగే విద్యార్థులను ఉపాధ్యాయులు నిరంతరం ప్రోత్సహిస్తూ సృజనని బయటకు తీయాలని సూచించారు.తదనంతరం ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు కర్ర అశోక్ రెడ్డి, మిల్కురి శ్రీనివాస్,సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి,న్యాయనిర్ణేతలుగా ఖాజా మంజూర్ అలీ,గాజుల రవీందర్ పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save