Maa Telangana News
Date of Publish : 03/11/2026, 6:02 am
Published by Muthyala Praveen Reddy

శాతవాహన విశ్వవిద్యాలయంలో విద్యార్థిని మృతి కలకలం

  • న్యాయం చేయాలంటూ సివిల్ హాస్పిటల్ ముందు ఎం.ఎస్.ఎఫ్ నిరసన

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిధి)

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో డి.చంద్రకళ అనే విద్యార్థిని ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతుంది.ఆదివారం హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని విద్యార్థిని మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ (ఎం.ఎస్.ఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా (ఎం.ఎస్.ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఇంజం వెంకట్ స్వామి మాదిగ,(ఎంఆర్పీస్) రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ హాజరై మాట్లాడారు.మృతురాలి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అమ్మాయి మృతికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని,భవిష్యత్తులో శాతవాహన యూనివర్సిటీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వీసీ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పీస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి బొర్రా బిక్షపతి మాదిగ, ఎంఆర్పీస్ కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ,ఎంఆర్పీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఉపేంద్ర మాదిగ,ఎంఆర్పీస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ, ఎం.ఎస్.ఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చెంచల నవీన్ మాదిగ,ఎం.ఎం.ఎస్ జిల్లా అధ్యక్షురాలు దండు వరలక్ష్మి మాదిగ, ఎం.ఎస్.పీ జిల్లా కన్వీనర్ బుద్ధుల వాణి, ఎం.ఎస్.ఎఫ్ శాతావాహన యూనివర్సిటీ అధ్యక్షులు చింతల అశోక్ మాదిగ, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీస్ సీనియర్ నాయకులు బోయినీ కొమురయ్య మాదిగ,చిలుముల రాజయ్య మాదిగ,తడగొండ శంకర్ మాదిగ,దండు అంజయ్య మాదిగ,కొత్తూరు రాజన్న మాదిగ, అల్వాల అనిల్ మాదిగ,ఖాతా మల్లన్న మాదిగ,దండు మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save