Maa Telangana News
Date of Publish : 21/10/2026, 8:46 pm
Published by Muthyala Praveen Reddy

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీ శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని అపార్ట్మెంట్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అపార్ట్మెంట్ ఆవరణలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి,సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రామకృష్ణా కాలనీ గ్రామ సర్పంచ్ శ్వేతా ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు,సంప్రదాయ దుస్తులలో పాల్గొని వేడుకకు మరింత శోభను తీసుకొచ్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్వేతా ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. నగరంలో ఉంటున్నా మన పల్లె సంస్కృతిని,మన మట్టి వాసనను మర్చిపోకుండా ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్వేతా ప్రణీత్ రెడ్డి,మహిళలు,అపార్ట్మెంట్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save