రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దుర్గామాత 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రూ.51 లక్కీ డ్రాలో వీ2 న్యూస్ రిపోర్టర్ శ్రీరామోజు శేఖర్–హరిత దంపతులకు లడ్డూను వేలం పాటలో లడ్డును దక్కించుకున్నారు. దుర్గామాత వార్షికోత్సవంలో నిర్వహించిన లక్కీ డ్రాలో లడ్డూ గెలుచుకోవడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
దుర్గామాత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకల్లో భాగంగా రూ.51 లక్కీ డ్రా ఏర్పాటు చేశారు.ఇందులో పాల్గొన్న శ్రీరామోజు శేఖర్–హరిత దంపతులకు లడ్డూ దక్కింది.అమ్మవారి ఆశీస్సులతో లడ్డూ ప్రసాదం లభించడం సంతోషంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.దుర్గామాత ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.