Maa Telangana News
Date of Publish : 22/10/2026, 8:16 am
Published by Muthyala Praveen Reddy

శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలోని శృతిజ్ఞ అపార్ట్మెంట్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అపార్ట్మెంట్ మహిళలు గునుగు,తంగేడు,బంతి,చామంతి పూలతో రంగురంగుల బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం ఆటపాటలతో మహిళలు,చిన్నారులు నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ సంప్రదాయబద్ధంగా పండుగను నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఇలాగే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,మహిళలు,చిన్నారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. 

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save