01/11/2026, Sunday · 09:42:04 PM About UsPrivacy PolicyContact Us
Maa Telangana News

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు

Muthyala Praveen Reddy 01/11/2026 7:26 PM ఆంధ్రప్రదేశ్ 13

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ - బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవిష్యత్తు
Want this news as a newspaper clip?Print News Clip

అమరావతి నవంబర్-1(మాతెలంగాణ బ్యూరో):

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో నిలబడిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు.రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు,79 మున్సిపాలిటీలు,నగర పంచాయతీలు - మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగాయి.8 చోట్ల ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట్ల పోటీ హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల కోసం 99.36 లక్షల మంది ఓటర్లు, 11,378 పోలింగ్ కేంద్రాలు, 10,262 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

*నగరాల్లో మందకొడి, పల్లెల్లో జోరు!*

ఈసారి పోలింగ్ సరళి ఆసక్తికరంగా సాగింది. ప్రధాన నగరాల్లో ఓటర్లు నిరాసక్తత ప్రదర్శించగా, చిన్న పట్టణాల్లో మాత్రం ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర సగటు 48.03% గా నమోదైంది. కర్నూలు జిల్లా గూడూరులో అత్యధికంగా 83.6% నమోదు కాగా, విశాఖ జీవీఎంసీ లో అత్యల్పంగా 39.74% మాత్రమే నమోదైంది. విజయవాడ 41.80%, గుంటూరు 40.99%, తిరుపతి 42.12% గా ఉంది.

*చెదురుమదురు ఘటనలు:*

ఒంగోలులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు పాలకొండలో ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేయడం అందరినీ ఆకట్టుకుంది.విజయవాడ 55వ డివిజన్ లో బ్యాలెట్ గుర్తులు తారుమారవడంతో పోలింగ్ ను రాత్రి 7.45 వరకు పొడిగించారు.మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి :: జనసేనలో చేరిన వంగవీటి రాధా.. మేయర్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా?

Polling ConcludedMunicipalElectionsFutureCandidatesBallotBoxes

About the author

Muthyala Praveen Reddy

Muthyala Praveen Reddy

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

55 Posts

Latest News

హైదరాబాద్‌లో నాలాలో పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ ఎన్.ఎచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఎల్ ఎండి కాలనీ నూతన ఎస్.ఐ కి శాలువాతో ఘన సన్మానం అంతర్గత సృజనకు పట్టం - రోల్ ప్లే లో మెరిసిన విద్యార్థులు తెలియజేస్తేనే తగ్గుతుంది నేరం - విద్యార్థులకు పోక్సో పై అవగాహన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు కరీంనగర్ కళాభారతిలో అన్నమయ్య సంకీర్తనల గానామృతం కార్యక్రమం ప్రారంభం ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపు.. పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్త - గంజాయి చాక్లెట్ మాయలో పడొద్దు! కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా నిలుపుదాం - డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం